సూపర్ స్టార్ మహేశ్ బాబు న్యూ లుక్ అదిరిపోయింది. పొడవాటి జుట్టు, గడ్డంతో మహేశ్ న్యూలుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డిని మహేశ్ బాబు కలిసి వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన చెక్కును అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన లుక్ వైరల్ అవుతోంది. తన తదుపరి చిత్రం SSMB 29లో ఆయన ఈ లుక్లో కనిపించనున్నారని సమాచారం.