భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండగలను దృష్టిలో పెట్టుకొని టికెట్ లేకుండా రైలులో ప్రయాణించే ప్రయాణికులకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేయనుంది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు ఎవరైతే టికెట్ లేకుండా రైలులో కనిపిస్తారో? వారి కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించనుంది. 17 జోన్లల ఉన్న జీఎంలకు రైల్వేశాఖ లేఖ రాసింది. తనిఖీల నివేదికలను నవంబర్ 18కి పంపించాలని కోరింది.