AP: కాకినాడలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంత చెరువు దగ్గర రోడ్డు మీద నిర్మించిన కాంప్లెక్స్‌ను కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. వైసీపీ హయాంలో డ్రెయిన్‌పై అడ్డగోలుగా మూడు దుకాణాల నిర్మాణం చేపట్టారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలను కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారమే కూల్చివేత జరుగుతుందని అధికారులు తెలిపారు.