కదులుతున్న రైలులో పాము ప్రత్యక్షమైన ఘటన గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ నుంచి గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్ ముంబైకి బయలుదేరింది. కాసర రైల్వే స్టేషన్ సమీపిస్తున్న సమయంలో AC కోచ్ G3లో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమైంది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణీకులు మరో కోచ్‌లోకి వెళ్లి, రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ పామును అధికారులు పట్టుకుని బయటకు వదిలేశారు.