దేశంలోని మహిళల భద్రతపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని BSP అధినేత్రి మాయవతి మండిపడ్డారు. UP, బెంగాల్, ఒడిశా, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేరాలపై చర్యలు తీసుకోకుండా ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలు చేయడం చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. మహిళల భద్రతపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చిందని.. ఇప్పటికైనా మహిళల భద్రతపై కఠిన చట్టాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.