KDP: రేపు జరగాల్సిన ప్రజా వేదిక రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా అంతటా గ్రామసభలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ నెల 23 సోమవారం జరగాల్సిన ప్రజల నుండి వినతులను స్వీకరించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.