తూ.గో: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ ఆన్లైన్ ఇసుక నిర్వహణ వ్యవస్థ పై తహశీల్దార్లు పూర్తి అవగాహన పెంపొందించుకుని మండల స్థాయిలో సిబ్బందికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. శనివారం ఇసుక నిర్వహణ వ్యవస్థ ఆన్లైన్ పోర్టల్ వినియోగంపై అమలాపురం కలెక్టరేట్లో తహశీల్దార్లకు, రవాణా ఏజెన్సీలకు అవగాహన కల్పించారు.