సత్యసాయి: భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన హోరనాడులోని శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని మాజీ మంత్రి, పెనుకొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉషశ్రీ చరణ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాజీ మంత్రి వెంట పెనుకొండ వైసీపీ నాయకులు ఉన్నారు.