ప్రకాశం: చీరాలలోని ఏపీ మోడల్ స్కూల్లో జూనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థిని శనివారం తీవ్ర అస్వస్థతకు గురికాగా.. హుటాహుటిన చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్కూల్లో దాదాపు 540 మంది విద్యార్థులు ఉన్నా ఏఎన్ఎం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో వారికి వైద్య సేవలు అందడం లేదని, ప్రాణాల మీదకు వచ్చినా పట్టించుకునే వారు లేరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.