KMR: కామారెడ్డిలోని చండీ మంత్రాలయంలో సెప్టెంబర్ 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చండీ ఆశ్రమ నిర్వాహకులు సూచించారు. ఆదివారం ఆశ్రమంలో సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాలలో స్వచ్ఛంద సేవ చేసే వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.