విజయ్ నటించిన “గోట్” (GOAT) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో, ఆ చిత్ర నిర్మాత అర్చన కలపతీ తెలుగు సినిమా పరిశ్రమలో “గోట్” (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో యాంకర్ తెలుగు చిత్ర పరిశ్రమలో మీరు మెచ్చే GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) ఎవరు అనేది ప్రశ్నించగా, అర్చన కలపతీ తన సమాధానంలో పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తరువాత, ఆమె వ్యక్తిగతంగా మహేష్ బాబును ఎంతో ఇష్టపడతానని, ఆయనను ఆమె “GOAT ” (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) అని భావిస్తానని పేర్కొన్నారు. మహేష్ బాబు సినిమాలు, ముఖ్యంగా “ఓక్కడు” మరియు ఇతర బ్లాక్బస్టర్ హిట్లను ఆమె చూశానని అర్చన పేర్కొన్నారు. మహేష్ బాబు సినిమాలలో ఆయన స్టైల్ అండ్ డిఫరెంట్ అప్రోచ్ పట్ల ఆమె ప్రశంసలు కురిపించారు.
“గోట్” సినిమా సెప్టెంబర్ 5వ తేదీ, వినాయక చవితి సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా, విజయ్ అభిమానులు మరియు చిత్రసీమకు సంబంధించిన వారు ఈ సినిమా మీద పెద్దగా ఆశలు పెట్టుకున్నారు. రాజకీయ ప్రవేశం కారణంగా ఇదే విజయ్ చివరి సినిమా అనే చర్చ బలంగా నడుస్తుంది తమిళ చిత్రసీమలో.. AGS ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు డైరెక్టర్, వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు