ఇప్పుడున్న సినిమా బిజినెస్ పరిస్థితుల్లో ఒకటే రోజు కాదుకదా, ఒకే వారం రెండు సినిమాలు రిలీజ్ చేసే పొజిషన్లో లేరు మన ప్రొడ్యూసర్లు. ఆడియన్స్ లో సినిమా పట్ల ఆసక్తి తగ్గడం, ఎంతో మంచి కంటెంట్ అని ట్రైలర్స్ ద్వారా వాళ్లకి నమ్మకం కలిగించడం కష్టతరంగా మారింది. ఆ విషయంలో సక్సెస్ అయినా సినిమాలకే ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆగష్టు లో ఒకే రోజు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 8 సినిమాలు రాబోతున్నాయి.
ఆగష్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం. ఆరోజు స్కూల్స్, ఆఫీస్ లు, మార్కెట్లు అన్నింటికీ సెలవు. పబ్లిక్ హాలిడే రోజు రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్లు పోటీపోడటం ఈనాటిది కాదు. ఎప్పటి నుండో చూస్తున్నాం. కానీ ఒకటి, లేదా రెండు మాత్రమే వస్తుంటాయి. సంక్రాంతి, దసరా లాంటి ముఖ్యమైన పండుగలకు కూడా మన ప్రొడ్యూసర్లు ఒకే రోజు రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ ఆగష్టు 15న మాత్రం ఎవ్వరు తగ్గలేదు
ముందుగా రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ ల డబుల్ ఇస్మార్ట్ ఒకటి మాత్రమే రిలీజ్ అవబోతుంది అనుకున్నారంతా. కానీ తరువాత అనూహ్యంగా రవి తేజ – హరీష్ శంకర్ కంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ కూడా అదే రోజు రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాకు ఒకరోజు ముందు 14న సాయంత్రం 6 నుంచి వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు గీత ఆర్ట్స్ నుంచి ఒక చిన్న సినిమా ‘ఆయ్ ‘., సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మరో చిన్న సినిమా నివేత థామస్, ప్రియదర్శి నటించిన “35” విడుదల అవబోతున్నాయి. వీటికి తోడు హిందీ నుంచి జాన్ అబ్రహం వేదా కూడా తెలుగు డబ్ అవబోతుంది, సూపర్ హిట్ సినిమా శ్రద్ధా కపూర్ స్త్రీ మూవీ సీక్వెల్ ” స్త్రీ 2 ” కూడా అదే రిలీజ్ అవబోతుంది. అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మై కూడా అదే రోజు రిలీజ్. తమిళ్ నుంచి విక్రమ్ తంగా లాన్ కూడా ఇదే రోజు రిలీజ్ అవుతుంది. విక్రమ్ తెలుగు మార్కెట్ ఎక్కువే, సరిపడా థియేటర్లు ఇవ్వాల్సిందే.
మొత్తం 8 సినిమాలకు థియేటర్లను ఎలా సమకూర్చాలని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటున్నారు. థియేటర్లు దొరికినా ఇన్ని సినిమాలు ఉంటె ఆడియన్స్ కూడా స్ప్లిట్ అయ్యి ఏ ఒక్క సినిమాకు మంచి జరగదని వారు భాభావిస్తున్నారు. గతంలో 2017 లో కూడా ఇలానే ఒకే రోజు ఆగష్టు 15న మూడు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యి ఏ ఒక్క సినిమా లాభాలను ఆర్జించలేదు. నితిన్ నటించిన లై’., బెల్లంకొండ శ్రీనివాస్- బోయపాటి కంబినేషన్ లో ‘జయ జానకి నాయక’., రానా- తేజ కంబినేషన్ లో నేను రాజు నేనే మంత్రి ఒకటే రోజు రిలీజ్ అయ్యాయి. మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో అని ఇండస్ట్రీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి