నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఆ అపూర్వ ఘట్టాన్ని పురస్కరించుకుని బాలయ్య ఫ్యాన్స్ ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. 1974లో తాతమ్మ కల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా బాలయ్య, తండ్రికి తగ్గ తనయుడిగా చేసిన ప్రతీ పాత్రలో తన మార్క్ ఏర్పరుచుకుని తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు.
50 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో బాలయ్య ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోయే పాత్రలు ఎన్నో చేశారు. పౌరాణికం, జానపదం, మాస్, కమర్షియల్, ఫ్యాక్షన్ ఇలా ఎలాంటి సినిమా అయినా మొదటి సినిమా నుంచి మొన్న వచ్చిన భగవంత్ కేసరి వరకు తనకంటూ ఒక గుర్తింపు, ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు బాలయ్య.
సెప్టెంబర్ 1వ తేదీన బాలయ్య తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతున్న శుభసందర్భంగా ఆయన ఫ్యాన్స్ కూకట్పళ్ళు ఖైత్లాపూర్ గ్రౌండ్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ముఖ్య అతిధులుగా వస్తారని సమాచారం. అలాగే బాలయ్యతో కలిసి పనిచేసిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, కో స్టార్స్ అంత ఈ సభకు హాజరవుతారని సమాచారం
ఇండీస్ట్రీకి వచ్చి 5 దశాబ్దాలు అయినా బాలయ్యలో ఎనర్జీ, జోష్ ఏ మాత్రం తగ్గలేదు. రెట్టించిన ఉత్సాహంతో సినిమా షూటింగ్స్ విషయంలో నవతరం ఆక్టర్స్ తో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబీ కొల్లి డైరెక్షన్లో నటిస్తున్నారు. ‘వీరమాస్’ అనే టైటిల్ ఈ సినిమా కు కన్సిడర్ చేస్తున్నారని సమాచారం