సాధారణంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్నది ఉన్నట్టు ఒప్పుకునే నటులు చాలా తక్కువ. కొద్దొగొప్పో మలయాళం, హిందీ ఇండస్ట్రీల్లో నటులు విమర్శలను స్వీకరిస్తారు. వాటికి సమాధానం కూడా ఇస్తుంటారు.
లేటెస్ట్ గా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఇలాంటి విషయమే ఒకటి చెప్పుకొచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ”తాను సినిమాల్లోకి ఇష్టంతో వచ్చానని డబ్బు కోసం కాదని.. అయితే బాలీవుడ్ సినిమాల్లో నటించేటప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో తన అవగాహనా ఉంటుందని… ఇతర బాషల సినిమాల్లో నటించేటప్పుడు తనకు సింక్ వుండట్లేదని, సెట్స్ లో ఏమి జరుగుతుందో కుడా అర్దమవట్లేదు’ అని చెప్పాడు.
సౌత్ లో పారితోషకం ఎక్కువ ఇస్తారు.. కానీ భాష రాకపోవం వల్ల ఎమోషన్ కనెక్ట్ అవ్వక, క్యారెక్టర్లో ఇన్వొల్వెమెంట్ లేక, నటించేటప్పుడు ఎదో యాడ్ షూట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ తీసుకున్న డబ్బుకి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్న.. ఆ విషయం లో నా మీద నాకే సిగ్గుగా వునని కుండా బద్దలుకొట్టాడు. నవాజుద్దీన్ రీసెంట్ గా వెంకటేష్ తో సైన్ధవః లో నటించాడు.
ఇలా బాలీవుడ్ నటులతో ఉండే ఇబ్బందుల విషయంపై చాలాసార్లు తెలుగు ఇండస్ట్రీ సీనియర్ నటులు కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే