»Supreme Court Directs Nta To Declare Centre Wise Results Of Neet Ug 2024 By July 20 Amid Paper Leak Row
Supreme Court: నీట్- యూజీ 2024 ఫలితాలను కేంద్ర, రాష్ట్రాల వారిగా విడుదల చేయాలని ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు
వైద్య విద్యా కోర్సులలో ప్రవేశించే విద్యార్థలకు నిర్వహించే పోటీ పరీక్ష నీట్లో పేపర్ లీక్ వివాదం గురించి తెలిసింది. ఈ క్రమంలో గ్రేస్ మార్కులు సాధించిన విద్యార్థులు మళ్లీ పరీక్షకు హాజరయ్యారు. వారి ఫలితాలు సైతం సోమవారం విడుదలయ్యాయి. దీంతో మొత్తం ర్యాంకులు మారిపోయాయి. మళ్లీ ఎలాంటి గందరగోళం తలెత్తకుండా రాష్ట్రాల వారిగా ఫలితాలను విడదుల చేయాలని ఎన్టీఏను సుప్రీం కోర్టు కోరింది.
Supreme Court directs NTA to declare centre-wise results of NEET-UG 2024 by July 20 amid paper leak row
Supreme Court: పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో నీట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు కేంద్రాల వారీగా మార్కులను విడుదల చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కోరింది. దేశంలో పోటీ పరీక్షలను నిర్వహించే ఎన్టీఏను జూలై 20 మధ్యాహ్నాం రాష్ట్రాల వారిగా నీట్ అభ్యర్థుల ఫలితాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. NEET-UG పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులను, వారి ర్యాంకులను నీట్ సైట్లో అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు NTAని ఆదేశించింది.
వైద్య విద్యా కోర్సులలో ప్రవేశించే విద్యార్థలకు నిర్వహించే పోటీ పరీక్ష నీట్లో పేపర్ లీక్ వివాదం గురించి తెలిసింది. ఈ క్రమంలో గ్రేస్ మార్కులు సాధించిన విద్యార్థులు మళ్లీ పరీక్షకు హాజరయ్యారు. వారి ఫలితాలు సైతం సోమవారం విడుదలయ్యాయి. దీంతో మొత్తం ర్యాంకులు మారిపోయాయి. మళ్లీ ఎలాంటి గందరగోళం తలెత్తకుండా రాష్ట్రాల వారిగా ఫలితాలను విడదుల చేయాలని ఎన్టీఏను సుప్రీం కోర్టు కోరింది.
అలాగే ఈ వివాదంపై సోమావారం విచారణ జరగనుందని గురువారం సుప్రీంకోర్టు తెలిపింది. “ఫలితాలను ఒక్కో కేంద్రానికి సంబంధించి విడివిడిగా ప్రకటించాలి. శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు విడుదల చేయాలని” భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ అన్నారు. ఇక NTA న్యాయవాది ఫలితాలనను ప్రకటించడానికి గడువు కావాలని కోరారు. దాంతో శనివారం మధ్యాహ్నం వరకు గడువు ఇస్తూ ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది.
పాట్నా, హజారీబాగ్లలో పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు స్పష్టంగా అర్థం అవుతుందని సుప్రీం తెలిపింది. దీనిపై మరల ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇక ఫలితాలు వెల్లడించేప్పుడు విద్యార్థులు గుర్తింపును గుట్టుగా ఉంచాలని, కేవలం రూల్ నెంబర్లనే విడుదల చేయాలని పేర్కొంది. అలాగే దీనిపై ఉన్న వివాదాన్ని సోమవారానికి వాయిదా వేసింది.