బాలీవుడ్లో అగ్ర హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ టాలీవుడ్లో నటించేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. తెలుగు మేకర్స్‌ని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన ఈ విషయమై ఏమంటున్నారంటే?
Akshay Kumar : టాలీవుడ్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్(Bollywood) అగ్ర నటుల్లో ఒకరైన అక్షయ్ కుమార్(Akshay Kumar) అన్నారు. ప్రస్తుత కాలంలో టాలీవుడ్ మేకర్లు చాలా ట్యాలెంటెడ్‌గా ఉన్నారని అన్నారు. వారు కొత్తగా ఆలోచిస్తున్నారని తెలిపారు. అందుకనే టాలీవుడ్ నుంచి ఏ సినిమా వచ్చినా అది నేషనల్ వైడ్‌గా విజయాలను అందుకుంటోందని అన్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తెలుగులో కన్నప్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అక్షయ్ కుమార్(Akshay Kumar) ఇటీవలే సర్ఫారితో థియేటర్లలో అలరించారు. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ఆధారంగా ఈ చిత్రం బాలీవుడ్లో తెరకెక్కింది. అది ఇప్పుడు థియేటర్లలో ఆడుతోంది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చారు. తన టాలీవుడ్ ఎంట్రీ(Tollywood Entry) గురించి ఇలాంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం తాను విష్ణు మంచు హీరోగా వస్తున్న కన్నప్ప అనే తెలుగు సినిమాలో చేస్తున్నానని అన్నారు. ఆ తర్వాత కూడా తనక సరిపోయే పాత్రలు వస్తే తప్పకుండా టాలీవుడ్లో నటిస్తానంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఏ భాషలో నటించినా దేశంలోని ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. అందుకనే తాను టాలీవుడ్ మేకర్స్‌తో పని చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తన పాత్ర నచ్చితే చిన్న పాత్ర అయినా సరే అక్షయ్ కుమార్ నటించేస్తారు. మిగిలిన హీరోలకు భిన్నంగా సినిమాలు చేసుకుంటూ పోతారు. ఇప్పటికీ ఏడాదికి ఐదారు సినిమాలు చేసేస్తూ ఉంటారు. ఇలాంటి హీరో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఆయనను దృష్టిలో పెట్టుకుని కూడా కథల్ని సిద్ధం చేసుకోవచ్చని టాలీవుడ్ మేకర్స్, రచయితలు భావిస్తున్నార్ట.