సోషల్ మీడియాలో దుమారం లేపిన యూట్యూబర్ ప్రణీత్ హన్మంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తండ్రీకూతుళ్ల బంధాన్ని లైంగికంగా అర్థం వచ్చేలా చేసిన కామెంట్స్‌పై తెలుగు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రెటీల వరకు అందరూ రియాక్ట్ అయ్యారు. దీంతో సైబర్ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.
Praneet Arrested: హద్దులు మీరి చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ యూట్యూబర్‌కు న్యాయపరంగా శిక్ష ఎదుర్కోనున్నాడు. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్ ప్రణీత్ హన్మంత్‌ను అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా షోషల్ మీడియాలో షేక్ చేస్తున్న విషయాన్ని పోలీసులు సిరీయస్‌గా తీసుకున్నారు. బెంగళూరులో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తరలించారు. ప్రణీత్ హన్మంత్ చేసిన వ్యాఖ్యలకు కామన్ మ్యాన్ నుంచి సెలబ్రేటీల వరకు అందరూ ఫైర్ అయ్యారు. అతన్ని అరెస్ట్ చేయాలని నెట్టింట్లో డిమాండ్ చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు.
ప్రణీత్ హన్మంతు ఓ యూ ట్యూబ్ ఛానెల్లో కంటెంట్ క్రియేటర్‌గా ఉన్నాడు. డార్క్ కామెడీ పేరుతో అనే విషయాలపై కామెంట్లు చేస్తూ ఫన్ జనరేట్ చేస్తుంటాడు. అతనితో పాటు తన స్నేహితుల కలిసి జూమ్ కాల్లో మాట్లాడుతూ రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటారు. తమకు నచ్చిన విధంగా రోస్ట్ చేసి వీడియోలను కిచిడి చేస్తుంటారు. అలా చేస్తున్న క్రమంలో ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రీల్‌పై మాట్లాడారు. అందులో ఓ తండ్రి తన కూతుర్ని కొట్టడానికి బెల్ట్ తీస్తాడు. తరువాత బెల్ట్‌పై ఊయల ఊపుతాడు. దానిపై తన స్నేహితులు చెత్త కామెంట్స్ చేశారు. ఈ ఒక్క వీడియోనే కాదు అతని యూట్యూబ్ ఛానెల్ మొత్తం ఇలాంటి వల్గర్ కంటెంట్‌తో నిండిపోయి ఉంటుంది.
ఆ వీడియోను హీరో సాయి దుర్గ తేజ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ట్యాగ్ చేస్తూ దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వెంటనే సీఎం రేవంత్ స్పందించారు. తరువాత మంచు మనోజ్, ఇతర సినీ సెలబ్రెటీలు స్పందించారు. అంతే కాకుండా మంత్రి సీతక్క సైతం స్వయంగా ఇలాంటి వాటిని ప్రొత్సహించకూడదు అని వీడియో బైట్ ఇచ్చారు. దాంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూర్‌లో ఉన్నట్లు పక్కా సమాచారంతో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.