»Tragedy In The Industry Popular Singer Usha Uthups Husband Chacko Uthup Died
Usha Uthup: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ గాయని భర్త హఠన్మరణం
ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త మరణవార్త పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. జాని చాకో ఉతుప్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. దాంతో గాయని అభిమానులు ఉషా ఉతుప్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Tragedy in the industry.. Popular singer Usha Uthup's husband Chacko Uthup died.
Usha Uthup: సినిమా పరిశ్రమలో పేరొందిన గాయని ఉషా ఉతుప్ (Usha Uthup) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త జాని చాకో ఉతుప్ (78) మరణించారు. కోల్కతాలోని వారిన నివాసంలో సోమవారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఫ్యామిలితో కలిసి టీవీ చూస్తోన్న సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దాంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఉతుప్ జంటకు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. తమ తండ్రి మరణంపై అంజలి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నాన్నా.. మమ్మల్ని అందరినీ వదిలేసి చాలా త్వరగా వెళ్లిపోయావు. నువ్వు ఎంతో స్టైలిష్గా జీవించావు. ప్రపంచంలో అత్యంత అందమైన మనిషివి. మేము నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అంటూ తన భావోద్వేగాన్ని రాసుకొచ్చారు.
ఉషా ఉతుప్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాటనైనా తన గొంతుతో పాడి అలరిస్తుంది. 1971లో ‘హరేరామ హరేకృష్ణ’ సినిమా ద్వారా తనకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే తెలుగులో ‘కీచురాళ్లు’ టైటిల్ సాంగ్తో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత చాలా పాటలు పాడింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు. ఇప్పటివరకు 15 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఎన్నో పాటలు పాడారు. భారతీయ సంగీతానికి తాను చేసిన మేలుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.