»Hot News Something Between Prabhas And Disha Patani
Disha Patani: హాట్ న్యూస్.. ప్రభాస్, దిశా పటానీ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్?
ప్రస్తుతం ప్రభాస్, దిశా పటానీ మధ్య ఏదో ఉందనే.. న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఇందులో నిజముందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఇది మాత్రం హాట్ హాట్ న్యూస్‌గా మారిపోయింది.
Hot news.. Something between Prabhas and Disha Patani?
Disha Patani: గతంలో ఆదిపురుష్ సినిమా విషయంలో హీరోయిన్ కృతి సనన్, ప్రభాస్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే టాక్ నడిచింది. కానీ తర్వాత కేవలం పుకార్లేనని తేలిపోయింది. ఇక ఇప్పుడు కల్కి సినిమాలో కలిసి నటించిన దిశా పటానీతో ప్రభాస్‌కు లింక్ పెట్టేశారు. అది కూడా ఒక్క టాటూ చూసి.. ఏదో ఉందని రాసెస్తున్నారు. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉండే దిశా పటానీ.. లేటెస్ట్గా ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో దిశా చేతి పై కనిపించిన PD అనే టాటూ.. హాట్ టాపిక్‌గా మారింది. అసలు ‘PD’ అంటే ఏంటి? అని ఆరా తీసే పనిలో పడిపోయారు. ఫైనల్‌గా P అంటే ప్రభాస్, D అంటే దిశా కాబట్టి.. అమ్మడు ప్రభాస్ కోసమే ఆ టాటూ వేయించుకుందనే టాక్ మొదలైంది.
అంతేకాదు.. ప్రభాస్ డార్లింగ్.. అని అర్థం వచ్చేలా టాటూ వేయించుకుందా? అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తన పేరు దిశా పటానీ కాబట్టి.. రివర్స్‌లో టాటూ వేయించుకుందా? అనే డౌట్స్ కూడా వెలువడుతున్నాయి. మొత్తంగా.. PD టాటూతో ప్రభాస్, దిశా పటానీలకు లింక్ పెట్టేస్తున్నారు కొందరు. కానీ PD అంటే ఏంటో.. దిశా పటానీకే తెలుసు. కల్కి సినిమాలో ఇద్దరు కలిసి నటించారు కాబట్టి.. ఇలాంటి రూమర్స్ పుట్టడం కామన్. కల్కిలో రాక్సీ అనే పాత్రలో నటించింది దిశా. ఈ సినిమాతో అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సమయంలో.. PD అనే టాటూ కంటబడడం చర్చకు దారి తీసింది. అన్నట్టు.. దిశా గతంలో టైగర్ ష్రాఫ్‌తో ప్రేమలో మునిగి తేలి, బ్రేకప్ చెప్పుకున్నట్టుగా టాక్ ఉంది. ప్రజెంట్.. సెర్బియన్ నటుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇల్లిక్తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతోందని బాలీవుడ్ వర్గాల మాట. ఏదేమైనా.. PD అంటే, ఏంటో మరి?