»Mumbai Dont Come To College Wearing Ripped Jeans And T Shirt
Mumbai: చిరిగిన జీన్స్, టీషర్ట్ ధరించి కాలేజీకి రావద్దు
కాలేజీ ఆవరణంలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ ఇటీవల నిషేధించింది. తాజాగా టీషర్ట్లు, జీన్స్‌పైన కూడా నిషేధం విధించింది.
Mumbai: Don't come to college wearing ripped jeans and t-shirt
Mumbai: కాలేజీ ఆవరణంలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ ఇటీవల నిషేధించింది. తాజాగా టీషర్ట్లు, జీన్స్‌పైన కూడా నిషేధం విధించింది. కాలేజీకి వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో రావద్దని తెలిపింది. చిరిగిన జీన్స్, టీషర్టులు, జెర్సీలతో వస్తే అనుమతించమని తెలిపింది. ఫార్మల్, డీసెంట్ దుస్తులతో పాటు హాఫ్ లేదా ఫుల్ షర్ట్, ప్యాంటు ధరించవచ్చని సూచించింది. బాలికలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులు ధరించన పర్వాలేదని తెలిపింది.
గత నెలలో కళాశాల ప్రాంగణంలో హిజాబ్, బుర్ఖా, నకాబ్, టోపీలపై నిషేధించడాన్ని పలువురు విద్యార్థులు బాంబే హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధం కరెక్టేనని హైకోర్టు తీర్పునిచ్చింది. క్రమ శిక్షణలో భాగంగానే డ్రెస్‌కోడ్ ఉంటుందని కాలేజీ యాజమాన్యం నిర్ణయం తెలిపింది. విద్యార్థులు నకాబ్, హిజాబ్, బుర్ఖా, క్యాప్ వంటివి ధరించి కాలేజీ వరకు వచ్చి.. గ్రౌండ్ ఫ్లోర్‌లోని కామన్ రూమ్‌లోకి వెళ్లి వాటిని మార్చుకుని తమ పనులు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే 75 శాతం హాజరు తప్పకుండా ఉండాలని తెలిపారు. అయిన ఈ ఆదేశాలు కొత్తగా ఇచ్చినవేం కాదని.. ఏడాది ఆరంభంలోనే జారీ చేసినట్లు కళాశాల పాలకమండలి తెలిపారు.