»Rakul Preet Singh Rakuls Husband In Debt Andaga Star Hero
Rakul Preethi Singh: అప్పుల్లో రకుల్ భర్త.. అండగా స్టార్ హీరో!
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త, నిర్మాత జాకీ భగ్నానీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడనే కథనాలు ఈ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రకుల్ భర్తకు బాలీవుడ్ స్టార్ హీరో అండగా నిలిచినట్టుగా తెలిసింది.
Rakul Preet Singh: Rakul's husband in debt.. Andaga star hero!
Rakul Preethi Singh: నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమించి, పెద్దలను ఒప్పించి ఇటీవలె అతనితో కలిసి ఏడు అడుగులు వేసింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే.. ఆమె భర్త 250 కోట్ల అప్పుల పాలైనట్టుగా బాలీవుడ్లో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. హిందీ చిత్ర పరిశ్రమలోని పెద్ద ప్రొడక్షన్ బ్యానర్లలో పూజా ఎంటర్టైన్మెంట్ కూడా ఒకటి. ఈ సంస్థను జాకీ భగ్నాని తన తండ్రి వాషు భగ్నానితో కలిసి నడిపిస్తున్నాడు. అయితే.. ప్రస్తుతం ఈ సంస్థ పరిస్థితి ఏమాత్రం బాగా లేదని.. ఇప్పటికే ఈ సంస్థ ఉద్యోగులలో దాదాపు 80 శాతం మందిని తొలగించినట్టుగా చెబుతున్నారు.
అంతేకాదు.. ఆఫీస్‌ని జుహులోని డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌కి మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. ఇటీవల రిలీజ్ అయిన బడే మియా ఛోటే మియా సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం అవడమే అని తెలిసింది. 350 కోట్లతో రూపొందిన ఈ చిత్రం కేవలం 60 కోట్లు మాత్రమే రాబట్టి.. నిర్మాణ సంస్థకి దాదాపు 250 కోట్ల రూపాయల నష్టం చేకూర్చింది. దీంతో.. ఫైనాన్షియర్లకు సుమారు 250 కోట్ల రుణాలు చెల్లించేందుకు.. వాషు భగ్నాని తన ఏడు అంతస్తుల పూజా ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అమ్మేసినట్టుగా వార్తలు వచ్చాయి.
అయితే.. ‘బడే మియా ఛోటే మియా’ సినిమాకి పనిచేసిన వాళ్లకు ఇంకా కొంతమందికి పేమెంట్లు పెండింగ్ ఉన్నాయట. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత స్టార్ మీరో అక్షయ్ కుమార్ తమకు అండగా నిలబడ్డాడని, అక్షయ్‌కి ఇవ్వాల్సిన పేమెంట్ ఆపేయమని కోరాడని చెప్పుకొచ్చాడు జాకీ భగ్నానీ. అన్ని పేమెంట్స్ క్లియర్ అయిన తర్వాతే ఇవ్వాలని చెప్పాడట. ఈ విధంగా.. రకుల్ ప్రీత్ సింగ్ భర్తకుఅక్షయ్ కుమార్ అండగా నిలిచాడని అంటున్నారు. ఏదేమైనా.. రకుల్ ప్రీత్ భర్త అప్పుల పాలవడం మాత్రం హాట్ టాపికే.