పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతితో సినిమా చేస్తాడని తెలిసినప్పుడు.. ప్రభాస్ ఫ్యాన్స్ వద్దని అన్నారు. కానీ ఇప్పుడు రాజాసాబ్ అప్టేట్ కోసం ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్గా మారుతి, తమన్ సాలిడ్ అప్టేట్ ఇచ్చారు.
Rajasaab: Vare.. Vare.. 'Rajasaab' has arrived.. Maruti, Taman solid update!
Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు. గత ఏడాది సలార్ సినిమాతో హిట్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ భారీ అంచనాలతో థియేటర్లోకి వస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలు.. బాక్సాఫీస్ బద్దలవుతుందని అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చెబుతోంది. కాబట్టి కల్కి ఏం చేస్తుందనే ఆసక్తి అందరిలోను ఉంది.
ఇకపోతే.. ప్రభాస్ లైన్లో ఇప్పటికే రాజాసాబ్ కూడా ఉంది. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మధ్య.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మారుతి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో వింటేజ్ లుక్‌లో మస్త్ ఉన్నాడు ప్రభాస్. అందుకే.. మొదట్లో మారుతితో సినిమా వద్దని చెప్పిన రెబల్ ఫ్యాన్స్.. ఇప్పుడు రాజాసాబ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఛాన్స్ దొరకాలే గానీ.. మాస్ బీట్స్‌ను అదిరిపోయేలా కొడతాడు తమన్. అలాంటిది వింటేజ్ డార్లింగ్ అంటే.. ఆ రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు మేకర్స్.
లేటెస్ట్గా రాజాసాబ్ మ్యూజికల్ సిట్టింగ్స్ స్టార్ట్ అయినట్టుగా తెలిపారు. చిత్ర దర్శకుడు మారుతితో పాటు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఉన్న ఫోటోను షేర్ చేశారు. వారే వారే వచ్చేశాడు రాజా సాబ్.. అంటూ చిన్న బిట్ కూడా రిలీజ్ చేశారు. ఈ బీట్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే తమన్ అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసినట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాలో గ్లామర్ ట్రీట్ కూడా మామూలుగా ఉండదని అంటున్నారు. ఎందుకంటే.. ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.