అమెరికాలో వరదలు తీవ్రం కావడంతో ఓ డ్యామ్ బద్దలైంది. దీంతో గ్రామాల్లో నీరు చేరింది. ఈ వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
USA: అమెరికాలో వరదలు తీవ్రం కావడంతో ఓ డ్యామ్ బద్దలైంది. దీంతో గ్రామాల్లో నీరు చేరింది. ఈ వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిన్నెసోటాలో బ్లూఎర్త్ కౌంటీలో ది ర్యాపిడాన్ డ్యామ్ ఈ వరదలకు బద్దలైంది. దీంతో డ్యామ్ కొంత భాగం దెబ్బతిన్నది. ఈ వరదల్లో ఓ వ్యక్తి కొట్టుకుపోయినట్లుగా కూడా అధికారులు గుర్తించారు.
BREAKING: DAM FAILURE! Rapidan Dam Near #Rapidan, #Minnesota Complete Failure Imminent! The Flooded River Has Eroded The Ground Around The Dam & Is Now Uncontrolled! The Dam Itself Has Not Failed Yet, But Engineers Believe It Can Completely Collapse At Any Time. pic.twitter.com/EV9FLrTDNw
స్పెన్సర్, క్లే కౌంటీలకు ఇతర ప్రాంతాల్లో సంబంధాలు తెగిపోయాయి. వరదలకు ఒక రైల్రోడ్ వంతెన కూడా కూలిపోయింది. దీంతో వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరద నుంచి 383 మందిని అధికారులు కాపాడారు. దీనికి ముఖ్య కారణం కుండపోత వర్షాలే అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నేల పూర్తిగా తేమతో నిండిపోయింది. భూమిలోని నీరు ఇంకలేదు.