నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ ‘అమిగోస్’.. ఈ నెల 10న రిలీజ్ కాబోతోంది. రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక వాటిని నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగిపోయాడు. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్ వస్తున్నాడని.. ఆ రోజున మిగతా విషయాలు మాట్లాడుకుందామని చెప్పుకొచ్చాడు కళ్యాణ్ రామ్. ఇక తాజాగా డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. చెప్పినట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వేన్షన్ హాల్లో, ఫిబ్రవరి 5న, సాయంత్రం 5 గంటల నుంచి గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్టు అఫిషీయల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అలాగే చిఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్ రాబోతున్నట్టు మరోసారి క్లారిటీ ఇచ్చారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అలాగే అన్న కోసం వెయిటింగ్.. ఎన్టీఆర్ 30 అప్డేట్ లోడింగ్ అంటూ.. రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్పీచ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామని చెబుతున్నారు. ఆస్కార్ టూర్ తర్వాత ఎన్టీఆర్ అటెండ్ అవుతున్న ఫస్ట్ ఈవెంట్ ఇదే. దాంతో యంగ్ టైగర్ నోట వచ్చే మాటలు వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి తారక్ స్పీచ్ ఎలా ఉంటుందో చూడాలి.