Alia Bhatt: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. ఆయన దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర దసరా కానుక వస్తుండడంతో ఫ్యాన్స్ ఇప్పటినుంచే సంబరాలు మొదలుపెట్టారు. అలాగే ఎన్టీఆర్ మరో సినిమా వార్ 2తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో కూడా తారక్ పాల్గొంటున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తోలిసారి నెగటివ్ రోల్లో కనిపిస్తారని సమాచారం.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ మేరకు తాజాగా ఆ చిత్రం నుంచి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ అందాల భామ అలియా భట్ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. జూలై చివరి వారంలో అలియా భట్ షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఈ భారీ మల్టీస్టారర్ 2025 ఆగస్టు 14న
రిలీజ్ కాబోతుంది.