కొందరికి దేవుడు అన్యాయం చేస్తాడు. ఎలా అంటే కొన్ని లోపాలతో పుట్టిస్తుంటాడు. కానీ.. వాళ్లకు మంచి చేయడం కోసం.. వాళ్లకు న్యాయం చేయడం కోసం ఏదో ఒక టాలెంట్‌ను ఇస్తుంటాడు. వాళ్లకు స్పెషల్ స్కిల్స్ ఇస్తుంటాడు. ఈ పిల్లాడు కూడా అలాంటి పిల్లాడే. ఎందుకంటే ఆ పిల్లాడికి చూపు లేదు. కానీ.. ఆ దేవుడు అద్భుతమైన గొంతు ఇచ్చాడు. ఎంతలా అంటే లతా మంగేష్కర్‌ను మించిన వాయిస్ తన సొంతం.
తాజాగా అజయ్ దేవగణ్ కచ్చె థాగే అనే మూవీలోని ఊపర్ ఖుదా ఆస్మాన్ నీచే అనే పాటను అద్భుతంగా పాడాడు. నిజానికి ఈ పాటను ఒరిజినల్‌గా పాడింది లత్కా మంగేష్కరే. 1999లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. సైఫ్ అలీ ఖాన్, నమ్రతా శిరోద్కర్, మనిషా కోయిరాలా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ఆ పాటను ఆ బాలుడు మళ్లీ పాడి అందరికీ ఆ సినిమాను మరోసారి గుర్తు చేశాడు.