benefits of neem water bath : ఆయుర్వేదం ప్రకారం.. వేపాకులు వేసుకున్న నీటితో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వేపాకుల నుంచి రసం తీసుకుని దాన్ని నీటిలో పోసుకుని స్నానం చేయవచ్చు. లేదంటే వేడి నీళ్లను కాచేప్పుడు వేపాకులను వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటంటే..?
ముఖ్యంగా చర్మ సమస్యలను నివారించడంలో వేపాకుల నీరు(neem water) సహాయ పడుతుంది. మనం బయట తిరిగేప్పుడు చర్మం పైకి అనేక విష పదార్థాలు వచ్చి చేరుతుంటాయి. వాటికి విరుగుడిగా ఈ వేప నీరు పనికి వస్తాయి. ప్రతి రోజూ వేపాకుల నీటని స్నానం చేయడం వల్ల చర్మానికి అది డిటాక్స్‌లా ఉపయోగపడుతుంది. చర్మ సమస్యలు కొంత వరకు తగ్గు ముఖం పడతాయి. వీటితో ముఖం కడుక్కోవడం వల్ల మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ లాంటివి క్రమంగా తగ్గుతాయి.
శరీరం దుర్వాసన రాకుండా వేప ఆకులు నిలువరిస్తాయి. వీటితో తల స్నానం చేయడం వల్ల తలలో చుండ్రు లాంటివి తగ్గుతాయి. స్కాల్ప్ పైన ఉండే పొక్కులు, గుల్లల్లాంటివి తగ్గి, దురద కూడా తగ్గుముఖం పడుతుంది. స్కాల్ప్‌పై వాపుల్లాంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. తేమ ప్రాంతాల్లో పని చేసే వ్యక్తులు ఎక్కువగా అలర్జీల బారిన పడుతుంటారు. అలాంటి వారు ఈ నీమ్ బాత్(neem bath) చేయడం వల్ల సమస్య దూరం అవుతుంది.