Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 7th)..కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు.
ఈ రోజు(2024 June 7th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
మొదలు పెట్టిన పనుల్లో దిగ్విజయం పొందుతారు. అనుకోని ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు.
వృషభం
విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. కుటుంబ కలహాలకు అవకాశాలు ఉన్నాయి. అనుకోని ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తవహించాలి. మీమీరంగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం.
మిథునం
ఊహించని కార్యాల్లో పాల్గొంటారు. మీమీరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవాలనుకొంటారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంది.
కర్కాటకం
అనుకోకుండా ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరుల మాటలు వినకూడదు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
సింహం
మనోధైర్యాన్ని కోల్పోవద్దు. కొత్తగా మొదలు పెట్టే పనులకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులకు దూరంగా ఉంటారు.
కన్య
కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. తద్వారా రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు వస్తుంది. ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు.
తుల
సన్నిహితుల సహకారం లభిస్తుంది. అనుకోకుండా ధననష్టం ఏర్పడుతుంది. అనారోగ్య బాధవల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
వృశ్చికం
ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. మంచి ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గౌరవిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
ధనుస్సు
అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడుతాయి. అశుభవార్తలు వినాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోవాలి.
మకరం
కుటుంబ కలహాలకు అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వృథా ప్రయాణాల వల్ల అలసట ఉంది. చెడు పనులకు దూరంగా ఉండటం మేలు. అందరితో స్నేహంగా ఉండే ప్రయత్నం చేయాలి.
కుంభం
సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అనవసర వ్యయప్రయాసలకు లోనవుతారు. వృధా ప్రయాణాలు ఉన్నాయి. ఆందోళనతోనే కాలం గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మీనం
తోటివారితో విరోధం ఏర్పడకుండా చూసుకోవాలి. వ్యాపారంలో నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు.