ప్రధాని మోడీ మరో ఫీట్ సాధించారు. ప్రపంచంలో ప్రజాదరణ నేతగా మారారు. పొలిటికల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మార్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన సర్వేలో మోడీకి ఎక్కువ మంది ఓటు వేశారు. పాపులర్ లీడర్ సర్వేలోొ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను వెనక్కి నెట్టేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది మోడీకి తమ ఓటు వేశారు. 22 దేశాలకు చెందిన ప్రజల అభిప్రాయం సేకరించారు.
మోడీ తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయేల్ లోపెజ్ ఒబ్రాడర్ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో స్విస్ అధ్యక్షుడు అలెన్ బెర్సెట్ నిలిచారు. 2023 జనవరి 26 నుంచి 31వ తేదీల మధ్య తీసిన డేటా ఆధారంగా పాపులర్ లీడర్‌ను మార్నింగ్ కన్సల్ట్ ప్రకటించింది. ప్రతి దేశం నుంచి యువకులు ఇచ్చిన రేటింగ్ యావరేజీ ఆధారంగా ఫలితం ఇచ్చింది. వారం రోజుల రేటింగ్‌ను పరిగణలోకి తీసుకుంది.
లోపెజ్ ఒబ్రాడర్కు 68 శాతం ఓటింగ్ లభించాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఇద్దరికీ 40 శాతం చొప్పున వచ్చింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కేవలం 30 శాతం ప్రజాదరణ పొందారు. మోడీకి పాలొయింగ్ ఎక్కువ. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. 2014లో అధికారం చేపట్టేందుకు అదే కలిసి వచ్చింది. ఆ తర్వాత మోడీ- షా ద్వయం వెనుదిరిగి చూసుకోలేదు. కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా దెబ్బతీస్తున్నారు. 2019లో సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్యను కూడా భారీగా పెంచేశారు