»Vishwak Sens Gangs Of Godavari Trailer Is Here Super Violent
Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ వచ్చేసింది.. సూపర్ వైలెంట్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ విడుదల అయింది. రా అండ్ రస్టిక్ గోదావరి బ్యాగ్‌డ్రాఫ్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
Vishwak Sen's Gangs of Godavari Trailer is here.. Super Violent
Gangs of Godavari: మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్యూటీఫుల్ హీరోయి నేహాశెట్టి (Neha Shetty) కథానాయకగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల అయిన విషయం తెలిసిందే. విడుదలైన ప్రతీ ప్రచార చిత్రం ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ సైతం విడుదల అయింది. రా అండ్ రస్టిక్ గోదావరి బ్యాగ్‌డ్రాఫ్‌లో డైలాగ్స్ కూడా ఊరమాస్‌గా ఉన్నాయి.
1990 రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగే కథగా అన్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. రాజకీయ నేపథ్యంలో సాగే కథలో హీరో పాత్ర ఏంటి, తాను యువ నాయకుడిగా ఎలా ఎదుగుతాడు. ఆ సందర్భంలో ఆయనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటన్నది స్టోరీ అని తెలుస్తుంది. ఇందులో విశ్వక్ సేన్ విశ్వరూపం చూపించాడు అని పిస్తుంది. మాస్ డైలాగ్స్, మాస్ అప్పిరియన్స్తో అదిరిపోయేలా ఉన్నాడు. అంతే కాదు సపోర్ట్ క్యారెక్టర్ చేసిన అంజలి సైతం అంతే రా అండ్ రస్టిక్‌గా కనిపించింది. ఇక డైలాగ్స్ కూడా ఊరమాస్‌గా ఉన్నాయి. నేహా శెట్టి అందాల ఆరబోత కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని హంగులు ఉన్న ఈ సినిమాను మే 31 విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.