Three Women : యువకులు తాగి గొడవ పడుతున్న సంఘటనలను మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. మహారాష్ట్రలో(Maharashtra) ఇందుకు భిన్నంగా ముగ్గురు యువతులు మద్యం తాగి పోలీసులతోనే గొడవకు దిగారు. పోలీసుల కాలర్లు పట్టుకుని, వారి మణికట్టును కొరికి బీభత్సం సృష్టించారు. ఇలా రెచ్చిపోయిన ఆ యువతుల్ని తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఘటన మహారాష్ట్ర ముంబయికి దగ్గరలోని ఫల్గర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ముంబయి శివార్లలో ఉన్న గోకుల్ టౌన్షిప్ లో రెస్టారెంట్ అండ్ బార్ ఉంది. అక్కడ కొంత మంది తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ పోలీసులకు ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేశారు. వారు అప్పటికే మద్యం సేవించి ఉన్నారు. ఈ విషయమై పోలీసులు విచారించగా బార్లోని కొందరు కస్టమర్లతో ఆ ముగ్గురు వాగ్వాదానికి దాగారని, అందుకనే వారిని తాము బయటకు వెళ్లిపోవాల్సిందిగా సూచించామని రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది.
ఇదే విషయాన్ని పోలీసుల అధికారులు(Police Officers) ఆ మహిళల దగ్గర ప్రస్తావించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన వారు ఏకంగా పోలీసుల మీదకే దెబ్బలాటకు వెళ్లారు. వారిని తిట్టడమే కాకుండా పోలీస్ కాలర్ పట్టుకుని మరీ దాడి చేయడానికి సిద్ధపడ్డారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో వారిని కంట్రోల్ చేశారు. చివరికి అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్గా మారింది.