పవర్ ఫుల్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకొన్ని గంటల్లో ఆహా యాప్ పై పడేందుకు పవర్ స్టార్ సైన్యం రెడీ అవుతోంది. బాలయ్యతో పవనిజం ఎలా ఉందో చూడడానికి తహతహలాడుతున్నారు. అందుకే ఓ రోజు ముందుగానే పవర్ బ్యాంగ్ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు. ‘అన్‌స్టాపబుల్ 2’ ఫైనల్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. దాంతో ఈ రాత్రికి ఏం జరగబోతుందనేది ఎగ్జైటింగ్‌గా మారింది. ఎందుకంటే ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయినప్పుడు ఆహా యాప్ క్రాష్ అయింది. ఎక్కువ మంది ఒకేసారి యాప్ ఓపెన్ చేయడంతో పని చేయలేదు. ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఒకేసారి ఆహా మీద పడితే ఏంటి పరిస్థితి అనేదే అందరి డౌట్. అందుకే ఆహా ముందు జాగ్రత్త పడుతోంది. దాదాపు 20 లక్షల మంది ఒకేసారి యాప్ ఓపెన్ చేయవచ్చని ఆహా అంచనా వేస్తోంది. ఆ తాకిడిని తట్టుకుని యాప్ క్రాష్ అవ్వకుండా.. బ్యాకప్ సర్వర్లను రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ఎపిసోడ్ లాగ గంట లేట్ కాకుండా.. కరెక్ట్ టైంకే పవన్ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేసేలా సర్వం సిద్ధం చేశారు. అయినా కూడా పవన్ తాకిడి ఇంకాస్త ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. ఆహా వారు మోత మోగించడానికి పవన్ ఫ్యాన్స్ రెడీగా ఉండాలని అప్డేట్స్ ఇస్తున్నారు. అన్నట్టుగానే ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాలో పవర్ సైరన్ మోత మోగపోతోంది. దాంతో పవన్ ఎపిసోడ్ అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. మరి పవన్, బాలయ్య ఎలా సందడి చేశారో చూడాలంటే.. ఇంకొన్ని గంటలు ఓపిక పడితే చాలు.