బాలీవుడ్ జంట పక్షులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఫిబ్రవరి 6 న వీళ్ల పెళ్లి ఘనంగా జరగనుంది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో వీళ్ల వివాహం జరగనుంది. ఫిబ్రవరి 4, 5 న ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలు జరుపుకున్న తర్వాత ఫిబ్రవరి 6న సిద్ధార్థ్ మల్హోత్రా.. కియారా అద్వానీ మెడలో తాళి కట్టనున్నాడు.
బాలీవుడ్ నుంచి షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ తో పాటు ఇతర బాలీవుడ్ ప్రముఖులు వీళ్ల పెళ్లికి రానున్నట్టు తెలుస్తోంది. జైసల్మీర్‌లోని సూర్యఘర్ హోటల్లో కియారా, సిద్ మ్యారేజ్ జరగనుంది. ఇద్దరూ కలిసి ఆ వేడుకను ఫిక్స్ చేశారట. వాళ్లకు ఆ వేదిక నచ్చడంతో దాన్నే పెళ్లి వేదికగా చేశారని తెలుస్తోంది. పెళ్లికి వచ్చే అతిథులకు అదే హోటల్లోని లగ్జరీ విల్లాలలో స్టే చేసే విధంగా ఈ జంట అన్ని ఏర్పాట్లు చేసిందట. 2020 లో తొలిసారి సిద్ధార్థ్, కియారా అద్వానీ కలిసి షేర్షా అనే సినిమాలో నటించారు. ఆ తర్వాతే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని రోజుల పాటు సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లికి సిద్ధమయింది ఈ జంట.