నారా లోశేక్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేశ్ ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా వెహికిల్ తీసుకొచ్చారని చెబుతున్నారు. దీంతో పోలీసులతో టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం జరిగింది. నారా లోకేశ్ ఓ పోలీస్ ఉన్నతాధికారితో మాట్లాడారు. తన వాహనం ఎందుకు తీసుకొచ్చారు అని అడిగారు. మాట్లాడకూడదా..? చెప్పొద్దా అని మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరకు అందరూ నడుచుకోవాలని కోరారు. సీఎం జగన్పై విమర్శలు చేశారు. ఆయనకు పాలనపై అవగాహన లేదన్నారు. నిరక్షరాస్యుడు అని ఫైరయ్యారు. తన వాహనం వదలాలని కోరారు. లేదంటే తాము ఏం చేయాలో అదీ చేస్తాం అని బెదిరించారు.
సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై లోకేశ్ ఫైరయ్యారు. జీవో నంబర్ 1 ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అని సజ్జలను ఉద్దేశించి లోకేశ్ విరుచుకుపడ్డారు. తన ఓపిక సహించే వరకు చూడొద్దని వార్నింగ్ ఇచ్చారు. వారాహి ఆగదు, యువగళం ఆగదు అని లోకేశ్ స్పష్టంచేశారు. బైరెడ్డిపల్లిలో తన పాదయాత్ర వైసీపీ కార్యకర్తలు ప్లెక్సీ చింపివేశారని తెలిపారు. కార్యకర్తలకు కూడా లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
లోకేశ్ ఏడో రోజు యాత్ర పలమనేరులో గల రామాపురం నుంచి ప్రారంభమయింది. యాత్రలో టీడీపీలో చేరికలు కూడా జరుగుతున్నాయి. క్యాంప్ సైట్ వద్ద నారా లోకేశ్ సమక్షంలో భారీగా యువకులు పార్టీలో చేరారు. ఎంసీ పాలెంకు చెందిన కొందరు, రంగాపురంకు చెందిన కొన్ని కుటుంబాలు, పలమనేరు పెద్ద మసీదు వీధికి చెందిన ముస్లిం కుటుంబాలు, మాజీ సర్పంచ్ కలిసి టీడీపీలో చేరారు.