bigg boss 16 contestant ankit gupta comments on casting couch
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచమే కాదు.. మాయా ప్రపంచం అవును. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అది టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా.. చివరకు హాలీవుడ్ అయినా. ఎందుకంటే.. చాలామంది ఎన్నో కలలు కని ఇండస్ట్రీకి వస్తారు. ఆ కలలను సాకారం చేసుకోవాలని అనుకుంటారు. దాని కోసం ఎంతో కష్టపడతారు కానీ.. ఈ కాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్ అనేవి వాళ్ల కెరీర్ ను దెబ్బ తీస్తుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాను అంటూ ముందుకు వచ్చాడు బిగ్ బాస్ 16 కంటెస్టెంట్ అంకిత్ గుప్తా.
నిజానికి కమిట్ మెంట్స్ అనేవి హీరోయిన్స్ కే ఎదురవుతాయి అని మనం ఇన్ని రోజులు అనుకున్నాం కానీ.. హీరోలు, నటులకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని అంకిత్ నోరు విప్పాకనే తెలుస్తోంది. బిగ్ బాస్ 16 నుంచి ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయిన అంకిత్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీ గురించి, కాస్టింగ్ కౌచ్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
అంకిత్ సీరియల్స్ లో బాగా పాపులర్. అక్కడి నుంచి బిగ్ బాస్ కు వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు. అయితే.. తనకు ఇండస్ట్రీలో చాలా వేధింపులు ఎదురయ్యాయట. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా ముఖం ముందే అడిగేశాడు. కాంప్రమైజ్ అవుతావా? అన్నాడు. కానీ.. నాకు అర్థం కాలేదు. ఇండస్ట్రీలో కొన్న పద్ధతులు ఉంటాయన్నాడు. స్టార్లు కూడా ఊరికే అవలేదని.. కొందరి పేర్లు చెప్పాడు. ఆ స్థాయికి రావడానికి వాళ్లు ఎన్నో త్యాగాలు చేశారని చెప్పాడు. నాతో మాట్లాడుతూనే నన్ను అసభ్యంగా తాకేందుకు చూశాడు. అక్కడ టచ్ చేయబోయాడు. దీంతో నేను ఇలాంటి పనులు చేయలేను. నా వల్ల కాదు అంటూ అక్కడి నుంచి తప్పించుకున్నాను. ఇది నా జీవితంలోనే వరస్ట్ బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ అంటూ అంకిత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. హవ్వా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అమ్మాయిలే అనుకున్నాం.. అబ్బాయిలను కూడా వదలడం లేదా వీళ్లు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.