వేతన జీవులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఊరట కలిగించారు. ఆదాయపు పన్ను పరిమితిని మరో రూ.2 లక్షలు పెంచారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షల వరకు పన్ను పరిమితి ఉండేది. ఇప్పుడు దానిని రూ. 7 లక్షలకు పెంచారు. ఇన్ కం టాక్స్ స్లాబ్లలో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు. ఐదు శ్లాబులలో పన్ను వేశారు. దాంతోపాటు ఇన్ కమ్ టాక్స్ రిబేటు విస్తరించారు. ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. నూతన ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆదాయ పన్ను గురించి నిర్మలా సీతారామన్ వివరించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు. రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుంది. రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను విధిస్తారు. రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను, ఏడాదికి ఆదాయం రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం గంట 25 నిమిషాల పాటు సాగింది.