Telangana: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కడియం కావ్యకు ఇటీవల బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ టికెట్ ఇచ్చింది. అయితే ఆ పార్టీ నుంచి పోటో చేసే ఉద్దేశం లేదని ఆమె నిరాకరించిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.