టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఆర్పీఎఫ్ బలగాలతో జెడ్ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. లోకేష్‌కు మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలు, నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Nara Lokesh: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఆర్పీఎఫ్ బలగాలతో జెడ్ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. లోకేష్‌కు మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలు, నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే మొత్తం 22 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరం భద్రత కల్పిస్తారు. వీళ్లలో ఐదుగురు ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు.
ఇంతకు ముందు లోకేశ్‌కు భద్రత ఎక్కువగానే ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్ భద్రతను తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ జెడ్ కేటగిరీ కల్పించాలని చేసిన సిఫార్సులను కాదని వై కేటగిరీ భద్రతను ఇచ్చింది. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని.. లోకేశ్‌కు తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భద్రతా సిబ్బంది చాలాసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్, హోంశాఖలకు లేఖలు రాశారు. దీంతో లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించారు.