Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం పిఠాపురం చేరుకుని ర్యాలీగా వెళ్లి టీడీపీ ఇంచార్జి, మాజీ శాసనసభ్యుడు వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంట్లో భోజనం ముగించుకుని హోటల్కి వెళ్లారు. ఇవన్నీ కాకుండా ఈరోజు జరగనున్న సభకు ‘వారాహి’ వాహనానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న రాత్రి 8:30 గంటల నుంచి పిఠాపురంలో భారీ వాహనాలను అనుమతించబోమని వారాహికి బ్రేక్ వేశారు. వారాహికి ప్రత్యామ్నాయంగా వేరే బండిపై వేదికను ఏర్పాటు చేశారు. అందులోంచి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అయితే వారాహి వాహనాన్ని పిఠాపురంలో మాత్రమే అనుమతిస్తారా.. లేక రాష్ట్రవ్యాప్తంగా అనుమతిస్తారా అనేది తెలియాల్సి ఉంది.