Allu Arjun: దుబాయ్ నుంచి బన్నీ వైరల్ పిక్.. అసలు ఒరిజినల్ ఎవరు?
పుష్ప సినిమా నుంచి స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు అల్లు అర్జున్. అలాగే పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మేడమ్ టుస్సాడ్స్‌లో అరుదైన గౌరవం అందుకున్నాడు.
Allu Arjun: పుష్ప సినిమా తర్వాత సంచలనంగా మారిపోయాడు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్‌గా ఎన్నో అరుదైన గౌరవాల్ని అందుకుంటున్నాడు. దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక ‘మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం’లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ మార్చి 28వ తేదీన జరగింది. ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు వెళ్లాడు. రెండు రోజుల ముందే భార్య స్నేహ, పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్లతో కలిసి హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు పయనమయ్యారు బన్నీ. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్ చేతుల మీదుగా వాక్స్ స్టాట్యూ ఓపెనింగ్ జరిగింది.
ఈ నేపథ్యంలో తన విగ్రహంతో కలిసి ఫోటో దిగాడు అల్లు అర్జున్. అయితే వెనుక నుంచి ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా.. ఈ రోజే వ్యాక్స్ స్టాట్యూ ఓపెనింగ్ జరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే.. వెనక నుంచి చూడడంతో.. ఆ విగ్రహంతో పాటు అల్లు అర్జున్ కూడా ఒకేలా కనిపిస్తున్నాడు. ఇందులో ఒరిజినల్ అల్లు అర్జున్ ఎవరు? విగ్రహం ఎవరు? అనేది కనిపెట్టడం కాస్త కష్టంగానే ఉంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈ ఘనత సాధించిన మూడో సౌత్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్‌లో మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అయితే.. ప్రభాస్, మహేష్ విగ్రహాలను లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయగా.. అల్లు అర్జున్ విగ్రహాన్ని దుబాయ్‌లో ఏర్పాటు చేస్తున్నారు.