Game Changer: గేమ్ ఛేంజర్ జరగండి పాట.. బెడిసి కొట్టిందిగా..!
గేమ్ ఛేంజర్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జరగండి పాట లిరికల్ వీడియో అభిమానులను చాలా ఉత్సాహపరిచింది. అయితే విడుదల అయ్యాక ఈ పాట అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
Game Changer: గేమ్ ఛేంజర్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జరగండి పాట లిరికల్ వీడియో అభిమానులను చాలా ఉత్సాహపరిచింది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రానికి మావెరిక్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. హైప్‌ని తీసుకొచ్చిన ఈ పాట అంచనాలను అందుకోలేకపోయింది. జరగండి పాటకు ప్రేక్షకుల నుండి చాలా పేలవమైన స్పందన వచ్చింది. జరగండి 24 గంటల్లో చాలా తక్కువ వ్యూస్ రావడం విశేషం.
ఈ పాట 4.5 మిలియన్ వీక్షణలు , 290K లైక్‌లను పొందింది, ఇది టైర్ 1 హీరో రేంజ్ ఆధారంగా చాలా తక్కువ స్కోర్‌గా పరిగణిస్తారు. ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరోకి దక్కని అత్యంత తక్కువ వ్యూవర్ షిప్ కావడం గమనార్హం. ఇది నిజంగానే శంకర్, రామ్ చరణ్ ఇద్దరికీ షాక్. జరగండి హిందీ , తమిళం రెండింటి నుండి వరుసగా 310K, 510K వీక్షణలను కలిగి ఉంది.
నెలరోజుల క్రితమే ఈ పాట లీక్ అయి వివాదానికి దారితీసింది. టీమ్ , ఎస్ఎస్ థమన్ ఆ పాటపై మళ్లీ పని చేశారు. ఇది నిన్న ఉదయం 9 గంటలకు విడుదలైంది. ఇందులో రామ్ చరణ్ , కియారా అద్వానీలు అద్భుతమైన కాస్ట్యూమ్స్‌లో కనిపించారు. అంత బడ్జెట్ కూడా పాటలకే ఖర్చు పెట్టారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఈ పాటకు కొరియోగ్రఫీని సమకూర్చారు. నిర్మాత దిల్ రాజు నిన్న ఒక ఈవెంట్లో విడుదల చేసిన పాట పూర్తి-నిడివి గల పాటలో కేవలం 2% మాత్రమే ఉందని అన్నారు. రిలీజ్ డేట్ గురించి కూడా పరోక్షంగా హింట్ ఇచ్చాడు. ఇలాంటి పాటకు ఇంత ఖర్చు ఎలా పెట్టారు రా బాబు అని ఫ్యాన్సే కామెంట్స్ చేస్తుండటం విశేషం.