Holi Festival : పిల్లలు, టీనేజర్లకు హోలీ పండుగంటే ఎక్కలేనంత ఆనందం. రకరకాల రంగులు, వాటర్ గన్లు పట్టుకుని వీధుల్లో హోలీ ఆడుకుంటూ తెగ సంబర పడిపోతుంటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అంతా ఈ పండుగను సరదాగా జరుపుకుంటూరు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు మనం హోలీ జరుపుకుంటూ ఉంటాం. అయితే మరి ఈ రోజు అసలు రంగులు ఎందుకు జల్లుకుంటామో తెలుసా? రండి ఇది చదివితే మీకే తెలిసిపోతుంది.
ద్వాపర యుగంలో రాధా దేవి పాల మీగడంతటి తెల్లటి రంగులో ఉండేదట. నల్లని కన్నయ్య ఆమెను చూసి ఓ సారి చిన్నబుచ్చుకున్నాడట. అప్పుడు కృష్ణుడి తల్లి యశోధ రాధ ముఖానికి ఇంత రంగు పులిమిందట. అది చూసి కృష్ణుడు నవ్వేశాడట. ఇక అప్పటి నుంచి హోలీ(HOLI) రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే ఆనవాయితీ వస్తోంది. వసంత రుతువు రాకను ఆహ్వానిస్తూ ఒకరిపై ఒకరు రంగులు(COLORS) చల్లకుని ఆనందించే ఆనవాయితీ కూడా మనకుంది.
హోలీ పండుగను( HOLI FESTIVAL) గతంలో సహజమైన రంగులతోనే జరుపుకునే వారు. ఇప్పటిలాగ కృత్రిమ రంగులు ఉండేవి కావు. అలా సహజమైన వాటితో ఈ పండుగ జరుపుకోవడం ఆరోగ్యానికీ మంచిదేనట. మోదుగ, బంతి పూలు, బంతి ఆకులు, బచ్చలి ఆకులు, బీట్రూట్, పాలకూర, దానిమ్మ గింజలు, దానిమ్మ తొక్కలు, పసుపు, కుంకుమ, సింధూరం, గోరింటాకు లాంటి సహజసిద్ధమైన వాటితో రంగులు తయారు చేసుకుని చల్లుకోవడం వల్ల ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం మన సొంతం అవుతాయి. అందరికీ హోలీ శుభాకాంక్షలు.