»Emraan Hashmis First Look Release From Pawan Kalyans Og
Emraan Hashmi: ‘ఓజీ’ నుంచి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఓజీ హ్యాష్ ట్యాగ్ నెట్టింట్లో ట్రెండింగ్లో ఉంది.
Emraan Hashmi's first look release from Pawan Kalyan's OG
Emraan Hashmi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న తాజా చిత్రం ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్). యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు సందర్భంగాబర్త్ డే విషెస్ తెలుపుతూ ఇమ్రాన్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు.