health tips : పరీక్షల టైంలో ఈ హెల్త్ టిప్స్ పాటించండి!
పరీక్షల సమయం వచ్చేసింది. ఈ టైంలో చాలా మంది ఒత్తిడికి లోనైపోతుంటారు. నిద్ర సరిగా పోకుండానే చదువుల్లో మునిగిపోతారు. మరి ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడమూ అవసరం. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు.
health tips for students : పరీక్షల సమయంలో పిల్లలు, టీనేజర్లు, యువకులు అనే తేడా లేకుండా అంతా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. మార్కులు, సిలబస్ కంప్లీట్ చెయ్యాలంటూ చాలా ఆందోళన పడిపోతుంటారు. ఇలాంటి సమయంలో వారు చదువు మీదే కాకుండా ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు ప్రత్యేకంగా తల్లిదండ్రులూ ఈ విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఈ సమయంలో వారికి అవసరం అయిన హెల్త్ టిప్స్( Health Tips) ఇవిగో.
కొంత మంది సిలబస్‌ని కంప్లీట్ చెయ్యాలన్న ఉద్దేశంతో నిద్ర పోకుండా రాత్రంతా చదువుతూ కూర్చుంటారు. ఇలా నిద్ర పోకపోవడం వల్ల ఆరోగ్యంపై ఆ ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఆరోగ్యం బాగోకపోతే పరీక్షల్ని సరిగ్గా ఎలా రాయగలం? అందుకనే తగినంత నిద్రకూ ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం రోజుకు ఆరు గంటల పాటైనా నిద్రించాలి. అలాగే ఈ సమయంలో జంక్‌ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి. మంచి ఆహారాన్ని కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి. నూనెల్లో వేపించిన పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండి.
అలాగే ఈ ఎగ్జామ్స్ సమయంలో(Exam time) హైడ్రేటెడ్‌గా ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి. బ్రేక్‌ఫాస్ట్‌ని అస్సలు స్కిప్ చేయకూడదు. పరీక్షలకు వెళ్లే ముందు చాలా మంది గాభరా ఉండి తినడం మానేస్తుంటారు. ఇలా మాత్రం అస్సలు చేయకూడదు. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రొటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండేలా చూడాలి. ఇవి మెదడును చురుకుగా ఉండేలా చేస్తాయి. పాల ఉత్పత్తులు, గింజలు, గుడ్లు, చేపలు తింటే మంచిది.