»Gangster Marriage Marriage Of A Lady Gangster With A Gangster Parole Allowed For Six Hours
Gangster Marriage: గ్యాంగ్‌స్టర్‌తో లేడీ గ్యాంగ్‌స్టర్ పెళ్లి.. ఆరుగంటల పాటు పెరోల్ అనుమతి
రాజస్థాన్‌కు చెందిన అనురాధ చౌదరి అలియాస్ మేడం మింజ్, హర్యానాకు చెందిన సందీప్ అలియాస్ కలా జథేడి గ్యాంగ్స్టర్లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 12న వివాహం వీరి వివాహం జరగనుంది. దీనికి కోర్టు అనుమతి కూడా ఇచ్చింది.
Gangster Marriage: రాజస్థాన్‌కు చెందిన అనురాధ చౌదరి అలియాస్ మేడం మింజ్, హర్యానాకు చెందిన సందీప్ అలియాస్ కలా జథేడి గ్యాంగ్స్టర్లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 12న వివాహం వీరి వివాహం జరగనుంది. వీరిద్దరి వివాహానికి కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. పెళ్లి కోసం సందీప్‌కు కేవలం ఆరు గంటల పెరోల్‌ను కోర్టు మంజూరు చేసింది. ఎంబీఏ చదివిన అనురాధ కొన్నాళ్లు బ్యాంక్‌లో ఉద్యోగం చేసింది. తర్వాత 2007లో దీపక్ మింజ్‌తో వివాహం జరిగింది. 2013లో భర్త నుంచి విడిపోయింది.
హర్యానా సోనిపట్‌లోని జాతేడి గ్రామానికి చెందిన సందీప్ ఐటీఐ చదివాడు. తర్వాత ఢిల్లీ వెళ్లిన అతను మొబైల్ చోరీకి ప్రయత్నించి దొరికిపోయాడు. ఇతనిపై కూడా దోపిడీలు, హత్యలు, హత్యయత్నం వంటి కేసులు ఉన్నాయి. ఏడు లక్షల రివార్డ్ కూడా ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తొలిసారి వీళ్లు కలుసుకున్నారు. 2020లో వీళ్ల ప్రేమ ప్రారంభమైంది. తర్వాత వీళ్లద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనురాధ బెయిల్‌పై విడుదలై ఉంది. చట్టబద్ధంగా సందీప్‌ను తరచుగా జైల్లో కలిసేది.