Krishnapatnam Port: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం ఓడరేవులో ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం అదాని కృష్ణపట్నం పోర్టుకు ఇండోనేషియా నుంచి ఓ నౌక బొగ్గు లోడుతో వచ్చింది. ట్యాంకర్‌ను క్యాజువల్ కార్మికులు శుభ్రం చేస్తుండగా గ్యాస్ లీకైంది. ఈ ప్రమాదంలో క్యాజువల్ ఉద్యోగులు ఖదీర్, ప్రశాంత్ మృతి చెందగా, మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఓడరేవులోని ఓడలోని ఆరో బెర్త్‌లో ఊపిరాడక ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.