»Teaser Launch At The Crematorium Gitanjali Malli Vacchindi
Gitanjali malli vacchindi: శ్మశానంలో టీజర్ లాంచ్
వినుత్నంగా చేయాలని ప్రతీ ఫిల్మ్ మేకర్ ప్రయత్నిస్తాడు. ఈ రోజుల్లో సినిమాలే కాదు పబ్లిసిటీ కూడా అదే స్థాయిలో వినుత్నంగా చేస్తున్నారు. తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్‌ను శ్మశానంలో విడుదల చేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది.
Teaser launch at the crematorium.. 'Gitanjali malli vacchindi'
Gitanjali malli vacchindi: వినుత్నంగా చేయాలని ప్రతీ ఫిల్మ్ మేకర్ ప్రయత్నిస్తాడు. ఈ రోజుల్లో సినిమాలే కాదు పబ్లిసిటీ కూడా అదే స్థాయిలో వినుత్నంగా చేస్తున్నారు. తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చింది(Gitanjali malli vacchindi) టీజర్‌ను శ్మశానంలో విడుదల చేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది. అంజలి ప్రధాన పాత్రలో తెరకెెక్కిన గీతాంజలి సినిమా మంచి విజయాన్ని సాధించింది. హారర్ కామెడీ చిత్రంగా ప్రేక్షకులను అలరించిన ఆ చిత్రానికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. కోన వెంకట్ కథకు శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. అంజలి(Anjali)కి ఇది 50వ సినిమా కావడం విశేషం.
ప్రేతాత్మకి సంబంధించిన కథలో హర్రర్ కాస్త ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. కథలో భాగంగా శ్వశాన సన్నివేశాలు చాలా భయంకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకనే టీమ్ కూడా వినుత్నంగా టీజర్‌ను శ్మశానంలో ప్లాన్ చేశారు. ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట శ్శశాన వాటికలో టీజర్ విడుదల అవుతుంది. శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేశ్, రవిశంకర్ తదితరులు నటించి ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.