ఈరోజుల్లో చాలామంది తమకు తెలిసిన వాళ్ల సలహాలు తీసుకోవడమే కాదు.. సోషల్ మీడియా నుంచి కూడా సలహాలు తీసుకుంటూ ఉంటారు. అవి ఏదో టైమ్ పాస్ సలహాలు కాదండోయ్.. తమ జీవితానికి సంబంధించిన అంశాలను కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో అడిగి.. నెటిజన్ల సలహాలను తీసుకుంటున్నారు. ఎంతైనా జనరేషన్ మారింది కదా.
తాజాగా ఓ యువతి.. తనకు కాబోయే భర్త ఉద్యోగం పోయిందని.. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసేవాడని, ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా పోయింది.. ఈ పరిస్థితుల్లో అతడిని పెళ్లి చేసుకోవాలా? వద్దా? అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి నెటిజన్ల సలహాలు, సూచనలు కోరింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు కూడా బాగానే స్పందించారు.
మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఫిబ్రవరి 2023 లో మా మ్యారేజ్ జరగాలి. కానీ.. ఇంతలో నాకు కాబోయే భర్త ఉద్యోగం ఊడింది. ఇప్పుడు ఆయన్ను నేను పెళ్లి చేసుకోవచ్చా? నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.. అంటూ చేసిన పోస్ట్ చూసి కొందరు నెటిజన్లు అయితే తెగ నవ్వుకున్నారు. మరికొందరు తనకు సీరియస్‌గా సలహాలు కూడా అందించారు.
నీ మైండ్ ఏది చెబితే అది చేయకు.. నీ మనసు ఏది చెబితే అది చేయ్ అంటూ కొందరు సలహాలు ఇచ్చారు. ఇదేనా ఫెమినిజం అంటే అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. మరో యూజర్ మాత్రం తనకు ఏకంగా మూడు ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటి అతడు పెళ్లి లోపే వేరే జాబ్ వెతుక్కోవాలని, రెండోది అతడిని పెళ్లి చేసుకొని హనీమూన్‌కు వెళ్లొచ్చని. ఎందుకంటే ఎలాగూ కంపెనీ సెవరెన్స్ పే ఇస్తుంది కాబట్టి దానితో పెళ్లి ఖర్చులు, హనీమూన్ ఖర్చులు వెళ్లిపోతాయి అని. మూడోది హిప్రోక్రిట్గా ఆలోచించి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడమే అంటూ తనకు కొందరు ప్రాక్టికల్‌గా ఆలోచించే సలహాలు ఇచ్చారు. ఏది ఏమైనా.. ఆ యువతి ప్రశ్న మాత్రం నెటిజన్ల బుర్రకు పదును పెట్టింది.
its an arranged marriage kaha ki hypocrisy, the whole thing is supposed to take place because of weird sexist reasons. if she doesnt marry shes just followinf the logic that both of their families are using anyway