»Student Slaps Teacher In Physics Wallah Live Class Viral Video
Viral video: లైవ్ క్లాసులో టీచర్ని చెప్పుతో కొట్టిన విద్యార్థి
ఫిజిక్స్ వాలా యాప్‌లోని లైవ్ క్లాస్‌లో ఓ విద్యార్థి టీచర్ని చెప్పుతో కొట్టి దాడి చేశాడు. ఈ వింత సంఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Student slaps teacher in physics wallah live class viral video
ఎడ్ టెక్ ప్లాట్‌ఫారమ్ ఫిజిక్స్ వాల్లా మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఒక ఉపాధ్యాయుడు లైవ్ క్లాస్ నిర్వహిస్తున్నప్పుడు ఆకస్మాత్తుగా ఒక విద్యార్థి వచ్చి ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టాడు. విద్యార్థి తన దాడిని కొనసాగిస్తున్నప్పుడు ఆ దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించాడు. చివరికి విద్యార్థి తన స్లిప్పర్‌తో కొట్టి అక్కడి నుంచి వెనక్కి వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే ఆ విద్యార్థి ఆ టీచర్ ను ఎందుకు కొట్టాడు. ఆ దాడి వెనుక ఉద్దేశ్యం ఎంటనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఫిజిక్స్ వాల్లాను ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన విద్యావేత్త అలఖ్ పాండే 2016లో స్థాపించారు. సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ మహేశ్వరితో కలిసి, పాండే ఫిజిక్స్ వాలా యాప్‌ను అభివృద్ధి చేశారు. ఇది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. యాప్ దాని విద్యాపరమైన కంటెంట్, మద్దతు కోసం ప్రజాదరణ పొందినప్పటికీ డిజిటల్ యుగంలో ఇలాంటి సంఘటనలు విద్యావేత్తలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు అని చెప్పవచ్చు.