ఈరోజుల్లో చాలా మ్యాట్రిమోనీ వెబ్ సైట్లు ఉన్నాయి. వాటిలో పెళ్లి కావాల్సిన చాలా మందికి తమకు నచ్చినట్లుగా ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అయితే… ప్రస్తుతం నెట్టింట ఓ పెళ్లి ప్రకటన వైరల్ గా మారింది. దాంట్లో… సాఫ్ట్ వేర్ అబ్బాయిలు మాత్రం వద్దు అంటూ…స్పెషల్ గా మెన్షన్ చేయడం గమనార్హం.
ఇంతకీ మ్యాటరేంటంటే… మా అందమైన యువతికి వరుడు కావాలి. ధనిక వ్యాపార కుటుంబంలోని డిగ్రీ పూర్తి చేసిన వధువుకు ఐపీఎస్, డాక్టర్, బిజినెస్ మ్యాన్ అయిన వరుడు కావాలి అని చెబుతూనే.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కాల్ చేయొద్దు అంటూ ఆ ప్రకటనలో స్పష్టం చేయడం గమనార్హం.
ఈ ప్రకటనను ప్రముఖ వ్యాపారవేత్త సమీర్ అరోరా ట్వీట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ‘ఐటీ ఫ్యూచర్ ప్రమాదంలో ఉందంటూ’ పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ పై నెటిజన్స్ కామెడీగా స్పందిస్తున్నారు.
అరోరా వ్యాఖ్యలపై కొందరు నేటిజెన్లు అయితే.. ఐటీ లేకపోతే దేశ భవిష్యత్తు సరిగా ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మేం అంత చెడ్డవాళ్లమా అంటూ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన ఆవేదన చెప్పాడు. దేవుడా బతికించావ్.. నాకు 11 ఏళ్ల క్రితమే పెళ్లి అయ్యింది అని మరో వ్యక్తి సరదాగా కామెంట్ చేశాడు.